Realme GT 8 Pro | రియల్​మీ జిటి8 ప్రొ సూపర్​ మొబైల్​​ నేడే విడుదల

Realme GT 8 Pro నేడు విడుదల కానుంది. స్వాప్‌ చేయగల కెమెరా మాడ్యూల్స్‌, Ricoh GR మోడ్‌, Snapdragon 8 Elite Gen 5 చిప్‌, 7,000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలు. అంచనా ధర, లాంచ్ వివరాలు ఇక్కడ చూడండి.

Realme GT 8 Pro launch tomorrow

Realme GT 8 Pro Launch today : Swappable Cameras, Ricoh GR Mode, 7000mAh Battery Highlights

(విధాత టెక్​ డెస్క్​)

Realme GT 8 Pro | సంవత్సరం చివర్లో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల పోటీ మరింత వేడెక్కుతున్న వేళ, OnePlus–Oppo తర్వాత ఇప్పుడు Realme రంగంలోకి దిగుతోంది. నవంబర్‌ 20న కంపెనీ Realme GT 8 Pro ను అధికారికంగా ఆవిష్కరించబోతోంది. గత మోడల్‌పై సాధారణ అప్‌గ్రేడ్లతో పాటు, ఈసారి డిజైన్‌–కెమెరా విభాగాల్లో ప్రత్యేకతలను తీసుకువస్తోంది.

GT 8 Pro డిజైన్‌లో అతి పెద్ద కొత్తతనం — కెమెరా మాడ్యూల్స్‌ను మార్చుకునే అవకాశం (Swappable Modules). రెండు చిన్న స్క్రూలు, మాగ్నెట్‌ సపోర్ట్‌తో లాక్ అయ్యే ఈ వ్యవస్థను ఉపయోగించి, యూజర్‌ అభిరుచికి అనుగుణంగా కెమెరా బ్లాక్‌ను మార్చుకోవచ్చు. స్క్వేర్‌, రౌండ్‌, రోబో థీమ్‌ సహా అనేక డిజైన్‌లను  ఎంచుకోగల అవకాశం రియల్‌మీ అందించనుంది.

ఫోన్​ వెనుకభాగంలో పేపర్‌ టెక్స్చర్‌ లాంటి వీగన్ లెదర్, రీసైకిల్‌ చేసిన పదార్థాలతో Photonic Nano-Carving ద్వారా తయారు చేసిన ప్రత్యేక ఫినిషింగ్​ ఇచ్చారు. పూర్తిగా పర్యావరణహితంగా ఉండటం ఈ ఫోన్​ ప్రత్యేకత.

ALSO READ : యూపీఐ లావాదేవీలు ఫెయిలైతే ఏం చేయాలి?

రియల్మీ జిటి8 ప్రొ పూర్తి ఫ్లాగ్‌షిప్ స్థాయి కెమెరా పనితనం : రికోతో సాధ్యం

Realme GT 8 Pro కెమెరా విభాగంలో ప్రముఖ జపాన్ బ్రాండ్ Ricoh తో నాలుగేళ్లుగా ప్రయాణిస్తోందిఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా యాంటీ–గ్లేర్‌ సెన్సర్‌తో, రికో ప్రత్యేక GR Mode తో వస్తోంది. ఈ GR మోడ్‌లో ఐదు ఫిల్మ్‌ టోన్లు ఉన్నాయి — Positive, Negative, High-Contrast B&W, Standard, Monochrome.

దీనికి తోడు ఫోటోలు, వీడియోల కోసం:

ఇక ప్రాసెసర్ పరంగా పెద్ద ఫోన్​లకు ఏమాత్రం తీసిపోని విధంగా శక్తివంతమైన సిపియు, ఏఐ, గ్రాఫిక్స్​ను కూడా పొందుపరిచింది.

డిస్‌ప్లే విభాగంలో 6.78 అంగుళాల QHD+ AMOLED, 144Hz రిఫ్రెష్‌ రేట్, గరిష్ట ప్రకాశం 4,000 nits. 7,000mAh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్‌ మందం కేవలం 8.2mm మాత్రమే. చార్జింగ్: 120W వైయర్డ్‌, 50W వైర్‌లెస్‌.

విడుదల వేడుక నేడు (నవంబర్‌ 20) మధ్యాహ్నం 12 గంటలకు YouTube ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.

అంచనా ధర:
చైనాలో బేస్‌ వేరియంట్‌ ధర 3,999 యువాన్‌ (సుమారు ₹49,400).
భారత ధర గత సంవత్సరం GT 7 తరహాలో ₹55,000 – ₹60,000 పరిధిలో ఉండే అవకాశం.

Latest News