Site icon vidhaatha

HCA నుంచి అజారుద్దీన్ అవుట్

విధాత: హెచ్ సీ ఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ను తొలగిస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్సీఏ ఓటర్ల జాబితా నుంచి అజారుద్దీన్ పేరు తొలగించారు. హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు.



హెచ్సీ ఏ అధ్యక్షుడిగా ఉంటూనే దక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడుగా కొనసాగినందుకు అజారుద్దీన్ పై అన్హత వేటు వేశారు. హెచ్ సి ఏ ప్రక్షాళనకు సుప్రీంకోర్టు లావు నాగేశ్వరరావు కమిటీ నియమించింది. ఈనెల 20న క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి.



హెచ్సీఏ నుంచి 57 క్లబ్స్ లను ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా కమిటీ ఇప్పటికే వేటు వేసింది. వాటికి సంబంధించిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. ఈ దఫా ఎన్నికల్లో 158 క్లబ్బులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. అధికార తుది జాబితా వెలువాడాల్సి వుంది.

Exit mobile version