Gambhir| ఎట్ట‌కేల‌కి టీమిండియా హెడ్ కోచ్ ప‌దవిపై స్పందించిన గంభీర్

Gambhir| టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసాక రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్ ప‌ద‌వి నుండి త‌ప్పుకోనున్న విష‌యం తెలిసిందే. అయితే త‌దుప‌రి హెడ్ కోచ్‌గా ఎవ‌రు వ‌స్తారు అనే సందేహం అంద‌రిలో ఉంది. గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‍కతా నైట్‍రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్‍లో అద్భుతంగా ఆడి టైటిల్ సాధిం

  • Publish Date - June 3, 2024 / 06:35 AM IST

Gambhir| టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసాక రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్ ప‌ద‌వి నుండి త‌ప్పుకోనున్న విష‌యం తెలిసిందే. అయితే త‌దుప‌రి హెడ్ కోచ్‌గా ఎవ‌రు వ‌స్తారు అనే సందేహం అంద‌రిలో ఉంది. గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‍కతా నైట్‍రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్‍లో అద్భుతంగా ఆడి టైటిల్ సాధించ‌డంతో గంభీర్‌ని హెడ్ కోచ్‌గా నియ‌మిస్తే బాగుంటుంద‌ని చాలా మంది త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బీసీసఐ కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంద‌నే టాక్ కూడా న‌డిచింది. అయితే ఈ విష‌యంలో గంభీర్ అభిప్రాయం ఏంటి, అత‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఆస‌క్తి చూపుతున్నాడా లేదా అనే విష‌యంలో ఎట్ట‌కేల‌కి క్లారిటీ వ‌చ్చింది.

టీమిండియాకు కోచ్‍గా ఉండేందుకు తాను ఇష్టపడతానని గౌతమ్ గంభీర్ చెప్పాడు. జాతీయ జట్టుకు కోచ్‍గా ఉండడం కంటే పెద్ద గౌరవం ఇంకేమి ఉండ‌ద‌ని ఓ కార్యక్ర‌మంలో తెలియ‌జేశాడు. భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ త‌ప్పకుండా గెలుస్తుంది. కాక‌పోతే భ‌యం లేకుండా ఆడాల్సి ఉంటుంద‌ని గౌతీ తెలియ‌జేశాడు. టీమిండియాకు కోచ్‍గా ఉండాలనుకుంటున్నారా.. ప్రపంచకప్ గెలిచేందుకు ఎలా హెల్ప్ చేస్తారని ఎదురైన ప్రశ్నకు గంభీర్ స్పందన ఎలా ఉందంటే.. “టీమిండియాకు కోచ్‍గా ఉండడాన్ని నేను ఇష్టపడతా. జాతీయ జట్టుకు కోచింగ్ చేయడం కంటే మరే పెద్ద గౌరవం ఉండదు” అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఒక‌వేళ గంభీర్ టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉంటే కేకేఆర్‌కి మెంటార్ గా ఉండే ఛాన్స్ ఉండ‌దు..

టీమిండియా కొత్త కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండ‌గా,గంభీర్ హెడ్ కోచ్ అయితే కేకేఆర్‌కు గంభీర్ 2027 వరకు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్ ఏ ఫ్రాంచైజీకి సేవలు అందించరాదు. సీఎస్కే, ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు కోల్‌కతానే. సీఎస్కే, ముంబై చెరో అయిదు ట్రోఫీలు సాధించగా కేకేఆర్ మూడు సార్లు విజేతగా నిలిచింది. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది. 2024లో గంభీర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేకేఆర్ జ‌ట్టు అద్భుతంగా ఆడి ట్రోఫీ గెలిచింది.

Latest News