Yunxing supersonic jet | అప్పుడెప్పుడో 1970ల్లో కాంకర్డ్(Concorde) విమానమొకటి ఉండేది. అది కూడా శబ్దవేగాన్ని దాటి ప్రయాణించేది. దీన్ని బ్రిటిష్–ఫ్రెంచ్ దేశాలు కలిసి తయారుచేసాయి. మాక్ 2.02(MACH 2.02) వేగం (అంటే శబ్దవేగానికి 2.02 రెట్ల వేగం = గంటకు 2,494 కిమీ లేదా 1550 మైళ్లు) వేగంతో ప్రయాణించేది. సన్నగా, పొడుగ్గా, వంగిన ముక్కుతో చూడ్డానికి అందంగా ఉన్నా, దీన్ని తయారుచేయడానికి ఖర్చు తడిసి మోపెడవడం, టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో చెవులు పగిలిపోయే శబ్దం రావడం లాంటి అవలక్షణాలు దీన్ని క్రమంగా దూరం చేసాయి. పులి మీద పుట్రలా 2000 జులైలో ఓ కాంకర్డ్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కూలిపోవడంతో (2000 Concorde Crash) లోపలున్న 109 మంది ప్రయాణీకులు, భూమ్మీద ఉన్న నలుగురు మరణించారు. దాంతో 2003లో ఈ విమానానికి గుడ్‌బై చెప్పాల్సివచ్చింది. అన్నట్లు ఈ విమానాలకు భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా(Air India) కూడా ఆర్డర్ ఇచ్చి, తర్వాత రద్దు చేసుకుంది. దాని తర్వాత ఇప్పుడు చైనా(China) సూపర్సోనిక్ విమాన తయారీలో విజయం సాధించనట్లు ప్రకటించింది.
చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ (Space Transportation) అనే కంపెనీ, తాను శబ్దవేగానికి 4 రెట్లు(మాక్ 4)MACH4 ఎక్కువ వేగంతో ప్రయాణించే ప్యాసెంజర్ విమానాన్ని(Passenger Jet) తయారుచేసినట్లు ప్రకటించింది. అంటే గత కాంకర్ద్ విమాన వేగానికి రెండు రెట్లు ఎక్కువ. 2027లో పూర్తి పరిమాణంతో ప్రయాణీకుల విమానాన్ని ఇవ్వగలమని స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ ధీమా వ్యక్తం చేసింది. ఈ విమానంతో బీజింగ్ నుండి న్యూయార్క్‌కు 8 గంటలు పట్టే సాధారణ విమానప్రయాణం, రెండు గంటలకు( 2hours for Beijing to NewYork) తగ్గిపోతుందని తెలిపింది.
బీజిం
తమ విమానం వాణిజ్య విమానరంగంలో, పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పిన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ షెన్ హైబిన్( Shen Haibin), అంతరిక్ష విహారయాత్రను కూడా సులభతరం చేస్తామని నవ్వుతూ అంది. ఇప్పుడు వర్జిన్ గెలాక్టిక్( Virgin Galactic) అంతరిక్ష యాత్రకు ఒక్కరికి 4,50,000 డాలర్లు ఖర్చవుతుండగా, తమ యాత్ర ఖర్చు 63,180 డాలర్లు మాత్రమే అని చెప్పింది.
సరే… అంతరిక్షయాత్ర మాట దేవుడెరుగు కానీ, విమాన ప్రయాణ సమయం తగ్గుతుందంటే ఆనందమే కదా.