విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణ దండన విధించింది. 2018లో నార్సింగిలో చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేశ్ కుమార్ అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు 2021లో ఉరిశిక్ష విధించగా.. ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్‌ను విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని సమర్ధించింది.