విధాత : తెలంగాణ అసెంబ్లీ భవనం రూపు రేఖలు పూర్తిగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. బుధవారం ఆయన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సహచర పలువురు మంత్రులతో కలిసి శాసన మండలి, శాసన సభ పరిసరాలను, భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. పార్లమెంటు నమూనాలో అసెంబ్లీని తీర్చిదిద్దాలన్నారు. అసెంబ్లీ ఎదుట విజయ్ చౌక్ తరహాలో మార్పులు చేయాలన్నారు.
శాసన సభ, మండలి ఒకే చోట ఉండేలా నిర్మాణాలు చేయాలన్నారు. శాసన సభ, మండలి మినహా మరే ఇతర భవనాలు అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవద్దన్నారు. రైల్వే గేట్‌కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్నారు. పార్కింగ్, ల్యాండ్ స్కేప్‌లను ఏర్పాటు చేయాలని, మరింత గ్రీనరీ పెంచాలని సూచించారు. అసెంబ్లీ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.