Yadagirigutta| యాదగిరిగుట్టలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది. గిరి ప్రదక్షిణకు వేల సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలి వచ్చారు.

విధాత : యాదగిరి గుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహస్వామి (Lakshmi Narasimha Swamy Temple) దేవస్థానం సన్నిధిలో అయ్యప్ప స్వాముల (Ayyappa Devotees) గిరిప్రదక్షిణ(Giri Pradakshina) కార్యక్రమం వైభవంగా సాగింది. గిరి ప్రదక్షిణకు వేల సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలి వచ్చారు. అయ్యప్ప, లక్ష్మీనరసింహ స్వామి స్మరణలతో అయ్యప్ప భక్తుల భజనల మధ్య సాగిన గిరి ప్రదక్షిణలో యాదగిరి కొండ మారు మ్రోగింది. గిరి ప్రదక్షిణ అనంతరం అయ్యప్ప స్వాములు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాదగిరి గుట్ట దేవస్థానం, అయ్యప్ప సేవా సమితిల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

 

Latest News