Mohammad Azharuddin : అజారుద్దీన్ కు మంత్రి పదవిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా సీఎం రేవంత్‌పై ఆరోపణలు.

Mohammad Azharuddin

విధాత, హైదరాబాద్: గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ మహ్మద్ అజారుద్ధీన్ కు మంత్రి పదవి విషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ బీజేపీ ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ల కోసం ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి అజారుద్దీన్ ని సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకుంటున్నారని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. 2023ఎన్నికల్లో అజారుద్ధీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన పోటీ చేసిన అంశాన్ని బీజేపీ గుర్తు చేసింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారని.,దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రధాన ఎన్నికల కమిషనర్ కు తమ ఫిర్యాదులో కోరారు. అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇచ్చే అంశాన్ని ఆడ్డుకోవాలని అభ్యర్థించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, ఆంటోనీలు ఈ ఫిర్యాదును అంందించారు.

Latest News