Site icon vidhaatha

క‌డియం రాజకీయంగా భూస్థాపిత‌మే.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ నేత క‌డియం శ్రీహ‌రిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇక క‌డియం శ్రీహ‌రి రాజ‌కీయంగా భూస్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ అన్నారు. క‌డియం పార్టీ మార‌డంపై టీవీ9 బిగ్ డిబేట్‌లో ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వ‌రంగ‌ల్‌లో క‌డియం శ్రీహ‌రి తాను చ‌చ్చి బీఆర్ఎస్‌ను బ‌తికించారు. మాకు బ్ర‌హ్మాండ‌మైన‌ లాభం జ‌రిగింది. వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్‌కు భారీ మెజార్టీ రాబోతోంది. కడియం శ్రీహ‌రికి ప‌ది ల‌క్ష‌ల రూపాయాలు ఇచ్చారా..? అనేది ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా చెప్పడు. ఇక క‌డియం ఓడిపోయి ఇంటికాడ ఉంటే నేనే పిలిచి ఆయ‌నను ఎంపీగా గెలిపించాను. ఇక్క‌డ అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని చెప్పి, ఎంపీకి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంను చేశాను. ఆయ‌న క‌ర్మ బాగా లేక బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిండు. రాజ‌కీయంగా అత‌ని అత‌ను భూస్థాపితం చేసుకున్నాడు. ఇది తప్ప‌కుండా జ‌ర‌గ‌బోతోంది. పార్టీలో నుంచి వెళ్లిపోయాక స్వేచ్ఛ లేద‌న‌డం ప్ర‌తి నాయ‌కుడికి అల‌వాటు. డిప్యూటీ సీఎం అయిన‌ప్పుడు, ప‌ద‌వులు అనుభ‌వించిన‌ప్పుడు క‌డియంకు స్వేచ్ఛ ఉంది. క‌డియం కూతురికి ఎందుకు టికెట్ ఇచ్చాం. కూతురికి టికెట్ ఇచ్చిన‌ప్పుడు స్వేచ్ఛ క‌న‌బ‌డ‌లేదా..? దుర్మార్గంగా పార్టీని వ‌దిలి వెళ్లిపోయాడు. అధికార పార్టీ వైపు పొద్దు తిరుగుడు పువ్వులా పోయిన‌ప్పుడు క‌డియంకు స్వేచ్ఛ‌ గుర్తుకు వ‌స్తుందా..? అని కేసీఆర్ నిల‌దీశారు.

Exit mobile version