ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు

  • Publish Date - December 12, 2023 / 01:17 PM IST

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి, రోడ్లు, మెట్రో రైల్ విస్తరణ తదితర అంశాలపై ఆయన చర్చించారు. డ్రైనేజీ, మంచినీటి సరఫరా వ్యవస్థల పనితీరు..తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గ్రేటర్ పరిధిలో ఆశించిన సీట్లు దక్కకపోవడంతో లోక్‌సభ ఎన్నికల నాటికి హైద్రాబాద్‌లో కాంగ్రెస్‌కు ఆదరణ సాధించే దిశగా తమ ప్రభుత్వ అభివృద్ధి మార్క్‌ను చూపించాలన్న పట్టుదలతో రేవంత్ ఉన్నారు. ఈ నేపధ్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కలిసి చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై రోడ్‌మ్యాప్ రూపకల్పనకు రేవంత్ దృష్టి సారించారని తెలుస్తుంది.