KA Paul : కేఏ పాల్ క్రిస్మస్ సందేశం..వైరల్

మత విద్వేషాలు వీడి, సర్వమత సమానత్వంతో శాంతియుతంగా జీవించడమే క్రీస్తు సందేశమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన క్రిస్మస్ సందేశం నెట్టింట వైరల్ అవుతోంది.

KA Paul

విధాత : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజాశాంతి అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఇచ్చిన సందేశం వైరల్ గా మారింది. క్రీస్తును అర్ధం చేసుకుంటే ప్రతి మనిషి పరోపకారిగా మారి..తిండి లేని వారికి తిండి, బట్ట లేని వారికి బట్టలు అందించేటువంటి సహాయ గుణం అలవర్చుకుని మానవత్వంలో దైవత్వాన్ని చాటుతారని పేర్కొన్నారు. 2025సంవత్సరాల క్రితం క్రీస్తూ జన్మించి 33 ఏళ్ల పాటు జీవించి…ఆఖరి మూడున్నరేళ్ల లో ఎన్నో అద్బుతాలు చేసి..కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలు తీర్చారని..అంగవైకల్యులను సశరీరులుగా సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేసి..ప్రజల మనస్సులకు శాంతి, శరీరానికి ఆరోగ్యం ఇచ్చారన్నారు.

ఇప్పుడు కూడా క్రీస్తు మానవాళి కష్టాలు తీర్చాలంటే..ప్రభువా నీవు నా హృదయంలోకి రా..నా మనస్సును మార్చు..నన్ను నీవలే చేయమని కోరితే..ఆయన కరుణిస్తారన్నారు. క్రీస్తు కరుణ లభిస్తే అందరూ క్రీస్తు వలేమానవతా వాదులుగా మారి..పరోపకారిగా, పరమత సహనం పాటించే వారిగా సర్వమత సమానవాదిగా మారిపోతారన్నారు. బంగ్లాలో దీప్ దాసు అనే హిందువును మత విద్వేషంతో దారుణంగా హత్య చేశారని దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

అలాగే పలు దేశాల్లో అనేక చోట్ల క్రిస్మస్ వేళ చర్చీలకు వెలుతున్న క్రైస్తవులపై దాడులు చేశారన్నారు. ఈ రకమైన విద్వేషాలు, అశాంతి కాకుండా ప్రజలంతా హిందూ, క్రిస్టీయన్, ముస్లిం అనే తేడాలు లేకుండా అందరూ శాంతియుతంగా, సురక్షితంగా సహాజీవనం చేయడమే క్రీస్తు సందేశం అని పాల్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Apple Santa : శాంటా క్లాజ్ శిల్పంతో పూరీ కళాకారుడి వరల్డ్ రికార్డ్
Prabhas | సందీప్‌రెడ్డి వంగా బర్త్‌డే స్పెషల్… ‘స్పిరిట్’పై హైప్ పెంచిన ప్రభాస్ పోస్ట్

Latest News