KA Paul Kansas State Senate speech| అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!

ప్రజాశాంతి అధ్యక్షుడు డాక్టర్ కే.ఏ.పాల్ అంటే ప్రపంచ దేశాల్లోనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికి సుపరిచితం. అయితే ప్రపంచ దేశాల్లో క్రైస్తవ ప్రచారకుడిగా ఆయనకున్న గుర్తింపు ఒక్క ఎత్తైతే..తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా..అడపదడపా తన విచిత్రమైన వ్యవహారశైలితో నవ్వులు పూయించే వ్యక్తిగా, ప్రజా సమస్యలపై ఉన్నత న్యాయ స్థానాల్లో పోరాటా యోధుడిగా విభిన్న పాత్రలతో పాల్ కు ఉన్న విభిన్నమైన గుర్తింపు మరో రకం.

విధాత : ప్రజాశాంతి అధ్యక్షుడు డాక్టర్ కే.ఏ.పాల్ అంటే ప్రపంచ దేశాల్లోనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికి సుపరిచితం. క్రైస్తవ మత ప్రచారకుడిగా, అమెరికాలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI), గాస్పెల్ టు ది అన్‌రీచ్డ్ మిలియన్స్ (GUM) వంటి సంస్థలను స్థాపించి, అనాథాశ్రమాలు, స్వచ్చంద సంస్థల నిర్వాహకుడిగా, మానవతావాదిగా గుర్తింపు పొందారు. అయితే ప్రపంచ దేశాల్లో క్రైస్తవ ప్రచారకుడిగా ఆయనకున్న గుర్తింపు ఒక్క ఎత్తైతే..తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా..అడపదడపా తన విచిత్రమైన వ్యవహారశైలితో నవ్వులు పూయించే వ్యక్తిగా, ప్రజా సమస్యలపై ఉన్నత న్యాయ స్థానాల్లో పోరాటా యోధుడిగా విభిన్న పాత్రలతో పాల్ కు ఉన్న విభిన్నమైన గుర్తింపు మరో రకం. తాజాగా అమెరికాలో పాల్ కు లభించిన గౌరవం ఆయన పట్ల తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత ఆసక్తిని, గౌరవాన్ని పెంచేదిగా ఉండటం విశేషం.

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అమెరికా కాన్సాస్ స్టేట్ సెనేట్ లో పాల్ ప్రసంగం

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కే.ఏ.పాల్ చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. పాల్ తన ప్రసంగంలో ప్రస్తుతం జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు పోవడమే కాకుండా, ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. యుద్ధాలు ఆగిపోవాలని ఈ సందర్బంగా ప్రత్యేకంగా డా.కే.ఏ.పాల్ ప్రార్థించారు. భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని పాల్ ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.

భారత్ లో ని ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా చిట్టివలస గ్రామంలో జన్మించిన కేఏ పాల్ మత ప్రవక్తగా, సామాజిక, రాజకీయ వేత్తగా, ప్రజాశాంతి పార్టీ సారధిగా బహుముఖ రంగాలలో తనదైన ప్రత్యేక శైలీలో రాణిస్తున్నారు. అమెరికాలో క్రైస్తవ మత ప్రబోధకుడిగా కొనసాగిన కాలంలో కేఏ.పాల్ తన సంస్థ కోసం కొనుగోలు చేసిన బోయింగ్ 747SP విమానాన్ని ‘గ్లోబల్ పీస్ వన్’ అని పిలిచేవారు. ఇది చైనా ఎయిర్‌లైన్స్ నుండి కొనుగోలు చేయబడింది.పాల్ తరచుగా తన బోయింగ్ విమానంలో ప్రపంచ శాంతి సభల ప్రచార కార్యక్రమాలకు, మూడవ ప్రపంచ దేశాలకు విపత్తు సహాయం అందించడానికి ఉపయోగించడం విశేషం. భారత దేశానికి తిరిగి వచ్చకా ప్రజాశాంతి పార్టీ స్థాపించిన కేఏ పాల్ .. పార్టీ ఫిరాయింపులు, ఫార్మాసిటీలు, ప్రాజెక్టుల భూనిర్వాసితులు, విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన, కామారెడ్డి మాస్టర్ ప్లాన్, విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపైన, ఏపీ మెడికల్ కాలేజీల పీపీపీ వివాదం, యెమెన్‌లో భారత నర్సు నిర్మిష ప్రియాకు విధించిన మరణ శిక్ష రద్దు పోరాటం సహా అనేక జాతీయ, ప్రాంతీయ సమస్యలపై పాల్ సాగించిన పోరాటాలు ఆయనకు మరింత గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. తాజాగా మరోసారి అమెరికా కాన్సాస్ స్టేట్ సెనేట్ లో ప్రసంగించడం ద్వారా తన స్థాయిని మరోసారి దేశ వాసులకు గుర్తిచేసినట్లయ్యిందంటున్నారు పాల్ అభిమానులు.

 

Latest News