విధాత : మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు కొండెక్కుతున్నాయి. నిన్నటి వరకు కార్తిక మాసంతో కొంతమంది నాన్‌వేజ్‌కు, గుడ్లకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, కార్తిక మాసం ముగింపు, క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్..వాటికి తోడు చలికాలంలో వేడివేడిగా కోడిగుడ్డుతో భోజనం చేయడం చాలమందికి ప్రీతి. దీంతో గుడ్డు ధర పైపైకి వెలుతుంది. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7కు పెరిగింది. ఏపీలో విశాఖ మార్కెట్‌లో 100గుడ్ల ధర 580రూపాయలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోవ 584రూపాయలుగా నేషనల్ ఎగ్ కోఆర్డీనేషన్ కమిటీ ఖరారు చేసింది. ఈ రేటు ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. స్థానికంగానే కాకుండా.. పశ్చిమ బెంగాల్, నార్త్ ఇండియా నుంచి కూడా కోడి గుడ్లకు డిమాండ్ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
రోజు వారి ఆహారంలో కోడి గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెబుతుంటారు. ఉడికించిన గుడ్లని తినడం మంచిదంటారు. గుడ్లు తినడంతో ఎన్నో పోషకాలు, లాభాలు ఉంటాయి. ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయని వైద్యులు చెబుతారు.