విద్యుత్ షాక్‌తో రైతు మృతి

మెదక్ ప్రత్యేక ప్రతినిధి: విద్యుత్ షాక్ తో రైతు తన పంట పొలం లోనే మృతి చెందిన విషాద సంఘటన మెదక్ మండలం పేరూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. పేరూరు గ్రామానికి చెందిన రైతు వెల్మకన్నే నగేష్ 40 తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లినప్పుడు అక్కడి విద్యుత్తు స్తంభం సపోర్ట్ వైరు తగిలింది.

  • Publish Date - June 12, 2024 / 08:29 PM IST

పేరుర్ గ్రామంలో విషాదం
2 గంటలపాటు గ్రామస్తుల రాస్తారోకో
స్పందించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: విద్యుత్ షాక్ తో రైతు తన పంట పొలం లోనే మృతి చెందిన విషాద సంఘటన మెదక్ మండలం పేరూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. పేరూరు గ్రామానికి చెందిన రైతు వెల్మకన్నే నగేష్ 40 తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లినప్పుడు అక్కడి విద్యుత్తు స్తంభం సపోర్ట్ వైరు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడి కక్కడే మృతి చెందారు. విద్యుత్ స్తంభం సపోర్ట్ వైరు తెగిపోయి సపోర్ట్ వైర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఈ సంఘటన జరిగింది.

విద్యుత్ అధికారాన్ని నిర్లక్ష్యం కారణంగానే రైతు నగేష్ తన ప్రాణాలను కోల్పోయాడని గ్రామస్తులు, కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్.. పేరూరు రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంఘటన స్థానానికి రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి శ్రీనివాస్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ శంకర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కల్పించుకొని నాయకులతో మాట్లాడి రైతు నగేష్ కుటుంబానికి 2 లక్షలు అందిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించారు. ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం ఇప్పించి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని మైనంపల్లి రోహిత్ చెప్పారని మాజీ సర్పంచ్ శంకర్ తెలిపారు.
కన్నీరు …మున్నీరు అయిన పేరూరు….
నగేష్ గ్రామంలో అందరితో కలుపు గొలుగా ఉండేవారని గ్రామస్తులు కంట తడి పెట్టారు. మృతునికి భార్య విజయ, కుమారుడు వెంకట రమణ, తల్లి దండ్రులు మల్లేశం,శేఖమ్మ ఉన్నారు. మృతుని కుమారుడు వెంకట రమణ, కూతురు దివ్య ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు.

Latest News