Site icon vidhaatha

ఘనపూర్ ప్రాజెక్ట్ రైతులకు తీపి కబురు

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్ ఆయకట్టు రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆయ‌క‌ట్టు ప‌రిధిలో 21625 ఎక‌రాలు సాగు కానున్న‌ది.

ప్రాజెక్టు పరిధిలోని ఎడమ, కుడి కాలువల ద్వారా జనవరి 13 నుంచి యాసంగి సాగుకోసం సింగూరు ప్రాజెక్టు నుండి ఘనపూర్ ప్రాజెక్ట్ కు 8 విడుతలుగా 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని ఇరిగేషన్ ఎస్ ఈ యేసయ్య తెలిపారు. నీటి విడుద‌ల విష‌యంపై ఘనపూర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version