నిజామాబాదు: మౌనికకు గవర్నర్ అభినందనలు

విధాత, నిజామాబాదు: గుడ్ గవర్నెన్స్ డేని పురస్కరించుకొని గత డిసెంబర్ 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందిన ఆర్కే కళాశాల విద్యార్థిని మౌనికను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. ఈ మేరకు ఆదివారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మౌనిక కలిసారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు ఆర్కే కళాశాలను, మౌనికను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, […]

  • Publish Date - January 1, 2023 / 02:13 PM IST

విధాత, నిజామాబాదు: గుడ్ గవర్నెన్స్ డేని పురస్కరించుకొని గత డిసెంబర్ 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందిన ఆర్కే కళాశాల విద్యార్థిని మౌనికను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు.

ఈ మేరకు ఆదివారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మౌనిక కలిసారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు ఆర్కే కళాశాలను, మౌనికను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, వారి బృందం మౌనికకు ప్రతిభను కొనియాడారు.

కార్యక్రమంలో ఆర్కే కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, కో-ఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, ఆడిటర్ విజయ్, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.