తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మంత్రి పదవి నాకు ఎవరి భిక్షా కాదు అంటూ, నాడు నాకు మంత్రి పదవి వచ్చినపుడు నువ్వు టీఆర్ఎస్‌లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉండి నిక్కినిక్కి చూశావు అన్న హరీశ్, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉండి, నక్కినక్కి చూశావు. ఇదంతా నీ ముందు జరిగిందే. కానీ ఏమీ తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు అంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్కెక్కడిది అన్న హరీశ్, తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచలుగా త్యజించిన చరిత్ర తమదని, పూటకో పార్టీ మారిన చరిత్ర, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర తనదని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా లేకుండా, చీఫ్ మినిస్టర్‌గా కాకుండా చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నావు అంటూ రేవంత్‌పై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
Readmore: