Site icon vidhaatha

నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్: హరీష్ రావు

హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కింద నెలనెలా మున్సిపాలిటీలకు డబ్బులిచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వెల్లడించారు. ఆనాడేమో కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడేమో డబ్బులు కట్టాల్సిందేనని ప్రజల వద్ద వసూలు చేస్తున్నారని హరీష్ అన్నారు. నో ఎల్‌ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందన్నారు. మా ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ కట్టాలని జీవో తెచ్చాం.. ఆ డబ్బు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని చెప్పామన్నారు. ఇక నుంచైనా ఎల్‌ఆర్ఎస్ నుంచి వచ్చిన డబ్బును మున్సిపాలిటీల అభివృద్ధికోసం ఖర్చు పెట్టాలని కోరుతున్నామని హరీష్ రావు అన్నారు.

Exit mobile version