విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి కొత్త భవనాలు మౌలిక వసతులతో ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని, అప్పుడు నాకున్న ఒక ప్రైవేట్ పాఠశాలలను అవసరమైతే మూసివేసేందుకు నేను సిద్ధమని, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సీఎం కుమారుడి నుంచి బంట్రోతు కొడుకు వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే ఆలోచన వచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలన్నారు, అలాగే ప్రభుత్వం 317, 46 జీవో లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ మార్గదర్శకంగా నడవాలని, అసెంబ్లీ నడుస్తుంటే సభ సంస్కారాలు పాటించాలని, సభ్యుడు చెప్పేది అందరూ వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సహం వస్తదన్నారు. నేను ఎంఎల్ఎ అవ్వడం కాస్త ఆలస్యం అయ్యిందని, నేను వంకర తోవలో గెలవాలి అంటే ఎప్పుడో ఎంఎల్ఎ అయ్యేవాడినని, సైటైర్లు నేను కూడా వేయగలనని, కానీ అది నా సంస్కృతి కాదన్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తగిన అవకాశం రానందున మీడియాలో పాయింట్ లో సభ గురించి మాట్లాడాననని వెంకట రమణరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ధరణిని వీలైనంత త్వరగా ప్రక్షాళన చేయాలని, ధరణితో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, భూ రికార్డులలో మార్పులకు సామాన్యులు కలెక్టర్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వీఆర్‌ఏలు, పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లక్షన్నర రైతు రుణమాఫీ చేయడం శుభపరిణామమని, రైతులకు ఇబ్బంది లేకుండా మిగతా రుణమాఫీ చేసి, ధాన్యం కొనుగోలు కళ్లాల వద్ధ సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. .మాజీ ఎమ్మెల్యే లకు తిరిగి గన్ మెన్ లను కేటాయించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నారు.