Kavitha| వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పోటీ : కవిత కీలక ప్రకటన

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి పోటీ చేస్తుందని అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. పార్టీ పేరు ఇదే ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అన్నారు. 2029 లో అసెంబ్లీ వచ్చే అవకాశముందని..ఎన్నికలు ఎప్పుడొచ్చిన మేము తప్పకుండా పోటీ చేస్తాం అన్నారు.

విధాత, హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల(Assembly elections 2029)లో తెలంగాణ జాగృతి (Telangana Jagruti) పోటీ చేస్తుందని అధ్యక్షురాలు కవిత (Kavitha) వెల్లడించారు. పార్టీ పేరు ఇదే ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అన్నారు.  2029 లో అసెంబ్లీ వచ్చే అవకాశముందని..ఎన్నికలు ఎప్పుడొచ్చిన మేము తప్పకుండా పోటీ చేస్తాం అన్నారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రజల మధ్య ఉండడం..ప్రజల సమస్యలు పరిష్కరించడమే జాగృతి విధానం అని స్పష్టం చేశారు. నేను ఎంపీగా మన ఊరు మన ఎంపీ కార్యక్రమంతో ప్రజల మధ్య ఉన్నానన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఎంపీ ఎన్నికల్లో కుట్ర చేసి నన్ను ఓడించారని, తర్వాత ఎంపీ ఇవ్వమంటే ఎమ్మెల్సీ చేశారని, ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారని..దీంతో స్వేచ్చగా ప్రజల మధ్య తిరుగుతున్నానన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం తీరుతో నా హృదయం ముక్కలైందని..మళ్లీ బీఆర్ఎస్ వైపు వెళ్లేది లేదని కవిత స్పష్టం చేశారు.

జనం బాటలో భాగంగా గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నామని, విద్వత్ గద్వాలగా ఒకనాడు పేరు పొందిన గద్వాలకు ఎంతో చారిత్రాక, సాంస్కృతిక, సాహితీ వైభవం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ లో 80.09శాతం అక్షరాస్యత ఉంటే..ఇప్పుడు తెలంగాణలో 77.9శాతం ఉందని, రూరల్ తెలంగాణలో 69.9శాతం ఉందన్నారు. మహిళల అక్షరాస్యత 65.9శాతం ఉందని..గత ఏడాది నుంచి 4శాతం తగ్గిందని, ఇది తెలంగాణ రైజింగ్ నా..ఫాలింగ్ నా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. గద్వాలలో అక్షరాస్యత 49.8శాతం మాత్రమే ఉండగా..మహిళలు 39.4శాతం మాత్రమే ఉందన్నారు. కేటిదొడ్డి మండలంలో 33.77శాతం మాత్రమే ఉందని..బీజేపీ ఎంపీ డీకే అరుణ దీనికి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యానించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న ఇక్కడి ఆసుపత్రి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు.

ఆర్డీఎస్, జూరాల సామర్ధ్యం పునరుద్ధరించాలని, నెట్టెంపాడు ప్రాజెక్టు, గట్టు ఎత్తిపోతలను పూర్తి చేయాలని, రోలంపాడు రిజర్వాయర్ ముంపు బాధితులను అదుకోవాలన్నారు. గురుకులాలకు సంబంధించి మూడేళ్లుగా అద్దెలు కట్టడం లేదన్నారు. ఎడ్యూకేషన్, ఇరిగేషన్ అని చెప్పుకునే సీఎం సొంత మహబూబ్ జిల్లాలో కూడా ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేయడం లేదన్నారు. ఆయన దృష్టి అంతా కరప్షన్, డైవర్షన్ అని కవిత విమర్శించారు.

ఎన్నికల హామీలపైన పాత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా మాట తప్పాయన్నారు. ఆరు గ్యారంటీలపై నిలదీసే వారే కరువయ్యారన్నారు. జాగృతి జిల్లాల వారిగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు.

Latest News