విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన బావ, మాజీ మంత్రి టి.హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి.. నివాళి అర్పించారు. ఎర్రెవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హరీష్ రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్ అక్కడ సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కేసీఆర్ వెంట కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గారి తండ్రి.. తన బావ గారైన తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. pic.twitter.com/PwlPPYK9Le
— BRS TechCell (@BRSTechCell) October 28, 2025
