Harish Rao | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు( Harish Rao ) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ( Satyanarayana ) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యనారాయణ పార్థివదేహాన్ని సందర్శనార్థం హైదరాబాద్‌లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచారు.
హరీశ్‌రావు తండ్రి మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు సంతాపం ప్రకటించారు.
