ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

విధాత : సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేయడం ఏమిటని మాజీ మంత్రి,సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. సీఎం స్వయంగా ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారించడం అనైతిక చర్య అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వస్తే జిల్లాకు ఏదో ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తారని , అలాంటిదేమి లేకపోగా..ఆయన స్థాయి పెరిగిన అవే బూతులు మాట్లాడుతున్నాడని జగదీష్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి స్థాయి లేకున్నా ముఖ్యమంత్రి పదవి అధిష్టించాక కొంచెమైనా విజ్ఞత నేర్చుకోవాల్సి ఉండేనని, ముఖ్యమంత్రిగా రెండేళ్లు అయినప్పటికి రోజురోజుకు సంస్కార హీనత పెరిగిపోతుంది అన్నారు.

హార్వర్డ్ కు వెళ్లి జ్ఞానం తెచ్చుకుంటాడనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి ఉన్న జ్ఞానం పోగొట్టుకున్నాడని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డి భాషను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు అన్నారు. ఉన్న సమస్యలను పక్కనపెట్టి ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేసేందుకే కేసీఆర్ పైన విమర్శలు, కేసుల విచారణల పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. సూర్యాపేట మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

స్థాయి మరిచి నాపై రేవంత్ విమర్శలు : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి నాపై అనుచిత విమర్శలు చేశాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి భాష బజార్ రౌడీలా ఉందన్నారు. నీ సంగతి నాకు తెలుసు..చంద్రబాబు కాళ్లు పట్టుకుంది ఎవరో అందరికి తెలుసు అన్నారు. కేసీఆర్ ని జాతిపిత కాదనటానికి రేవంత్ కు కొంచమైన సిగ్గుండాలన్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చి ఉండకపోతే నువ్వు సీఎం అయ్యే వాడివా అంటూ ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామంటే ప్రజలు నవ్వుతున్నారని భాస్కర్ రావు తెలిపారు. నేనెవరిని విమర్శించను..ఎవరికి భయపడను అని, మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసిందే నేనే అన్నారు. రూ.800 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని, రెండేళ్లు కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి ఎత్తి పోయలేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

World Largest Python| ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ దొరికేసింది!
TGPSC Group 1 exam| గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు హైకోర్టు ఊరట

Latest News