AP Budget 2026 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్ : ఏపీ సీఎం చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతతో 2026-27 ఏపీ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు.

AP Budget 2026

అమరావతి : ఏపీ ప్రభుత్వం రూపొందించిన 2026-27 వార్షిక బడ్డెట్ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మెరుగైందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకారంతో ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్నామని, రెండుమూడేళ్లలో మరింత మెరుగైన బడ్జెట్‌ ప్రవేశపెడతామన్నారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఆదాయం తక్కువ – ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చింది అని, వ్యవసాయం, సేవారంగాల నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సి ఉందన్నారు. రెండుమూడేళ్లలో రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది అని, అక్కడి రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నాం అని, అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయం పెరుగుతుందన్నారు. ఇన్నర్‌, ఔటర్‌ రింగురోడ్డుతో, అమరావతి పశ్చిమ బైపాస్ తో ఆదాయ మార్గాలు కూడా వృద్ది చెందుతాయని చంద్రబాబు ఆకాంక్షించారు. రాయలసీమ అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి ప్రయత్నిస్తున్నామన్నారు.

2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునేలా రాష్ట్ర బడ్జెట్ రూపొందించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం… 11.75 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2025-26 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు. సంపద సృష్టిలో భాగంగా రూ. 100 కోట్ల కార్పస్ తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, TReDS డిజిటల్ ప్లాట్ ఫాం అందుబాటులోకి తెచ్చాం.సాస్కీ కింద ఇప్పటి వరకు రూ. 6544 కోట్ల మేర నిధులను వినియోగించుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో రూ. 1438 కోట్లు సాస్కీ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది.పార్టనర్ షిప్ సమ్మిట్ సక్సెస్ సక్సెస్ అయింది… ఏపీ లాజిస్టిక్స్ ఏర్పాటు చేశాం. పారిశ్రామిక వృద్ధి కోసం ఏపీ వ్రభుత్వం ఇప్పటి వరకు 26 పాలసీలు రూపొందించినట్లుగా తెలిపారు.

2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 41, 118.36 కోట్లుగా ఆర్థిక మంత్రి పయ్యావుల బడ్జెట్ లో వెల్లడించారు. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 22, 002.50 కోట్లు, 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ. 80,567.47 కోట్లు, 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ. 75,868.09 కోట్లు అని తెలిపారు.

మూలధన వ్యయాన్ని గత బడ్జెట్ కంటే గ రూ. 14,417.82 కోట్ల మేర పెంచారు. 2025-26 రివైజ్డ్ అంచనాల్లో మూల ధన వ్యయం రూ. 39,497.56 కోట్లు అని, 2026-27 బడ్జెట్ అంచనాల్లో మూల ధన వ్యయం రూ. 53,915.38 కోట్లు అని,
మూల ధన వ్యయం పెంచడం ద్వారా ఆస్తుల కల్పనకు పెద్ద పీట వేసినట్లుగా తెలిపారు.

2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు:

• ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు
• దీపం 2.0 – రూ.2,601 కోట్లు
• వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు
• స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు
• వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు
• ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు
• తల్లికి వందనం – రూ.9,668 కోట్లు
• స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు
• ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు
• సమగ్ర శిక్ష – రూ.2,946 కోట్లు
• ఉన్నత విద్య – రూ.2,566 కోట్లు
• డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ.2,161 కోట్లు
• మన బడి, మన భవిష్యత్ – రూ.1,500 కోట్లు
• నైపుణ్యాభివృద్ధి – రూ.1,232 కోట్లు
• పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ.707 కోట్లు
• సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర – రూ.654 కోట్లు
• యువత, క్రీడలు – రూ.438 కోట్లు

2026-27 రాష్ట్ర బడ్జెట్‌ లో వివిధ రంగాల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కేటాయింపులు:

• రాయలసీమ గ్లోబల్ హర్టీకల్చర్ హబ్ – రూ.30 వేల కోట్లు.
• 3 సిటీ ఎకనమిక్ రీజియన్లు-విశాఖ, అమరావతి, తిరుపతి.
• వీబీ జీ రాం జీ పథకం-రూ. 8,365 కోట్లు
• ఏపీ వెల్త్ ఫండ్ – రూ. 100 కోట్లు
• నేతన్నలకు ఉచిత విద్యుత్-పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ కు 200 యూనిట్లు
. నేతన్నలకు ఉచిత విద్యుత్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు. లక్ష కుటుంబాలకు లబ్ది.
• పాఠశాలలు, హస్టళ్లల్లో మౌళిక సదుపాయాల కల్పన – రూ. 1800 కోట్లు
• ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో TReDS (బిల్ డిస్కౌటింగ్ విధానానికి డిజిటల్ ప్లాట్ ఫాం) అమలు
• క్వాంటం కంప్యూటింగ్- రూ. 638 కోట్లు
• దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం
• పోలీసులకు 3 వేల కొత్త పోలీస్ వాహనాలు

2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం-నీటి భద్రత కేటాయింపులు:

• మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు
• అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు
• పోలవరం – రూ.6,105 కోట్లు
• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు
• ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు
• మత్స్యకార సేవలో – రూ.260కోట్లు
• పంటల బీమా – రూ.250 కోట్లు
• పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు

2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు:

• వీబీ జీ రామ్ జీ – రూ.8,365 కోట్లు
• గృహనిర్మాణం (పట్టణ-గ్రామీణ) – రూ.5,451 కోట్లు
• డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్యసేవ ట్రస్ట్ – రూ.4,000 కోట్లు
• జల జీవన్ మిషన్ – రూ.4,000 కోట్లు
• రీ ప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ – రూ.2,144 కోట్లు
• స్వచ్ఛభారత్ మిషన్ – రూ.1,037 కోట్లు
• నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ – రూ.955 కోట్లు
• ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ – రూ.838 కోట్లు

2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రధాన విభాగాలు, శాఖలవారీ కేటాయింపులు:

• పాఠశాల విద్య – రూ.32,308.32 కోట్లు
• బీసీ వెల్ఫేర్ – రూ.23,650.88 కోట్లు
• పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ – రూ.22,941.54 కోట్లు
• వైద్యారోగ్యం – రూ.19,306.04 కోట్లు
• నీటివనరులు – రూ.18,223.67 కోట్లు
• పట్టణాభివృద్ధి, పురపాలిక శాఖ – రూ.14,538.68 కోట్లు
• విద్యుత్ రంగం – రూ.13,934.25 కోట్లు
• వ్యవసాయ రంగం – రూ.11,745.21 కోట్లు
• సాంఘీక సంక్షేమం – రూ.11,118.84 కోట్లు
• ఈడబ్ల్యుఎస్ సంక్షేమం – రూ.10,699.33 కోట్లు

ఇవి కూడా చదవండి :

Kavitha : ఇది జస్ట్ ట్రైలర్ .. అసలు సినిమా ముందుంది: కవిత
Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెల‌కు రూ.2.8ల‌క్ష‌ల సంపాదన‌.. ఐటీ ఉద్యోగుల‌కు కూడా ఇంత జీతం రాదేమో..!

Latest News