Kavitha : ఇది జస్ట్ ట్రైలర్ .. అసలు సినిమా ముందుంది: కవిత

కొత్త పార్టీపై ట్రోల్స్‌కు కవిత కౌంటర్. “ఇది జస్ట్ ట్రైలర్.. అసలు సినిమా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు.

Kavitha : ఇది జస్ట్ ట్రైలర్ .. అసలు సినిమా ముందుంది: కవిత

విధాత, హైదరాబాద్ : నేను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించగానే తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని..అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంది అని తెలంగాణ జాగృతి కవిత అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పరోక్షంగా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేసి 36స్థానాల్లో గెలిచిందని, వడ్డెపల్లి మున్సిపాల్టీలో మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపైన, బీఆర్ఎస్ పైన ప్రజల నిరాదరణ కనిపించిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య పొత్తుకు ఈ ఎన్నికలు తొలి మెట్టుగా నిలిచాయని కవిత అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది అని, కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుంది అని, గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 స్థానాలకే పరిమితం అయ్యారన్న అంశాన్ని విస్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలి అన్నారు.

కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే వారికి మద్దతు ఇస్తామని చెప్పుకునే స్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారింది అని కవిత విమర్శించారు. కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో కేసీఆర్ పై ఆరోపణలు చేసిన సీపీఐకి మద్దతివ్వటమంటే కేసీఆర్ పై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అంగీకరించినట్లేనా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రానున్న ఎనిమిదిన్నర సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని..జమిలి ఎన్నికల నేపథ్యంలో నాకు ఆరు నెలలు బోనస్ కూడా వస్తది అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి వచ్చే బోనస్ సంగతేమోగాని.. ముందు రైతులకు ఇచ్చే బోనస్ సంగతి చూడండి అని కవిత హితవు పలికారు. తెలంగాణకు పదిన్నర ఏళ్ల పాటు నేనే రాజు, నేనే మంత్రి అంటూ రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడటం అప్రజస్వామికంగా ఉన్నాయని, రాజగోపాల్ రెడ్డి వంటి వారు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం పదవే గుంజు కుంటానంటున్నాడని కవిత చురకలేశారు.

ఇవి కూడా చదవండి :

Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెల‌కు రూ.2.8ల‌క్ష‌ల సంపాదన‌.. ఐటీ ఉద్యోగుల‌కు కూడా ఇంత జీతం రాదేమో..!
Ananya Nagalla | పొట్టి గౌనులో కాక రేపేస్తున్న అనన్య నాగళ్ల.. వామ్మో!