విధాత: బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావాలని సందేశం పంపించారు. మంగళవారం ఆయన తన ఫామ్ హౌస్ లో వారితో భేటీ కాను. తాజా రాజకీయ పరిస్థితులు, బీఅరెస్ నుంచి కొనసాగుతున్న వలసలపై ఆయన వారితో కీలక చర్చలు జరపరునున్నట్లు సమాచారం. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేజారిపోతారోనన్న ఆందోళనతో ఉన్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారు పార్టీ విడకుండా బుజ్జగించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా అనుసరించాల్సిన వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. జులై 15వ తేదీలోగా మరో 15 మంది బీఅరెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పార్టీ సంస్థాగత బలోపేత అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.
బీఅరెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు… ఫామ్ హౌస్ కి రావాలని సందేశం
బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావాలని సందేశం పంపించారు.

Latest News
అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుందట..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 ..