BJP Vs Congress : మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ బీజేపీ..తోపులాట

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి, బీజేపీ మధ్య పూజా వేడుకలో వాగ్వివాదం, ఘర్షణ కారణంగా స్టేషన్‌కు తరలించారు.

Komatireddy Venkat Reddy

విధాత, నల్లగొండ : నల్లగొండ(Nalgonda) జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి(Komatireddy Venkat Reddy), బీజేపీ శ్రేణులకు మధ్య తలెత్తిన వాగ్వివాదం తోపులాటకు..ఉద్రికత్తకు దారితీసింది. పట్టణంలోని ఒకటో నంబర్ వినాయక విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధిని వివరించడం మొదలుపెట్టారు. దీంతో బీజేపీ నాయకులు జోక్యం చేసుకుని దేవుడి దగ్గర రాజకీయాలు మాట్లాడవద్ధంటూ అభ్యంతం వ్యక్తం చేశారు. వేదికపై తమను ఎందుకు ఆహ్వానించలేదంటూ బీజేపీ(BJP) జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి(Nagam Varshith Reddy) వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ-కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య వాగ్వివాదం ఘర్షణ తలెత్తింది.

ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొనడంతో పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఈ వివాదంతో మంత్రి కోమటిరెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రికి అనుకూలంగా పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి( Kancharla Bhupal Reddy) కూడా నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేశారు.