మూసీలో 70కిలోమీటర్లు కొట్టుకపోయి.. దొరికిన మృతదేహం

మూసీ నదిలో 70కి.మీ. కొట్టుకుపోయి అర్జున్ మృతదేహం లభ్యం. రామా, దినేశ్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Musi River

విధాత, హైదారబాద్ : ఆసిఫ్​నగర్ మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ నాలాలో ఆదివారం రాత్రి గల్లంతైన మామా అల్లుళ్లు అర్జున్, రామాలలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని భీమలింగం సంగెం బొళ్లెపల్లి కాజ్ వే వద్ద మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతదేహం మూసీ నదిలో 70కిలో మీటర్ల కొట్టుకపోయి దొరికిన ఘటన నది వరద ఉదృతికి నిదర్శనంగా నిలిచింది. అధికారులు మృతదేహాన్ని వెలికి తీసి బంధువులకు అప్పగించారు. అర్జున్​కు భార్య శకుంతల, ముగ్గురు ఆడపిల్లలున్నారు. నెల కిందటే కొడుకు పుట్టాడు. రామాకు కూడా నలుగురు పిల్లలు ఉన్నారు. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ముషీరాబాద్​లో వినోబా నగర్ నాలాలో గల్లంతైన దినేశ్(సన్నీ) అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. దినేశ్​ కు భార్య రాజశ్రీ, మూడేండ్ల కొడుకు కార్తీక్ ఉన్నారు. దినేశ్​ పేస్ట్ కంట్రోలర్​గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి భారీ వర్షం సమయంలో దినేశ్​ టూ వీలర్​పై నాలా పక్క నుంచి వెళ్తు వరద తాకిడికి నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు.