విధాత, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోతు వెంకన్న శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మామునూర్ సబ్ డివిజన్ పరిధిలో బెల్లం వ్యాపారుల ద్వారా మధ్యవర్తి నుండి రూ. 40వేల ను తీసుకుంటుండగా దృష్టిసారించి స్టేషన్లో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అన్నారం పెద్దతండా బెల్లం వ్యాపారులతో ఇటీవల ఎస్సై వెంకన్నకు తగాదా ఏర్పడింది. ఈ క్రమంలో జిల్లా ఏసీబీ అధికారులు దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఎస్సై ని ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. కాగా ఎస్సై వెంకన్నను వరంగల్ కోర్టు లో హాజరు పరిచివట్లు, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.