Professor Balakista Reddy | తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

Professor Balakista Reddy | హైద‌రాబాద్ : తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి( Telangana Higher Education ) చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టా రెడ్డి( Professor Balakista Reddy ), వైస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఇటిక్యాల పురుషోత్తం( Itikyala Purushotham ) నియామ‌కం అయ్యారు.

Professor Balakista Reddy | హైద‌రాబాద్ : తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి( Telangana Higher Education ) చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టా రెడ్డి( Professor Balakista Reddy ) నియామ‌కం అయ్యారు. వైస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఇటిక్యాల పురుషోత్తం( Itikyala Purushotham ) నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు విద్యా శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం( Burra Venkatesham ) ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టా రెడ్డి న్యాయ క‌ళాశాల‌లో సేవ‌లందించారు. ఇటిక్యాల పురుషోత్తం ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎక‌నామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేశారు. పురుషోత్తం ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

ప్ర‌స్తుతం ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి( R Limbadri ).. 2021 ఆగస్టు 24న ఉన్నత విద్యామండలి ఆఫిషియేట్‌ చైర్మన్‌గా (తాత్కాలిక హోదా) నియమితుల‌య్యారు. 2021 నుంచి 2023 వ‌ర‌కు ఆయన చేసిన సేవలను పరిగణనలోనికి తీసుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023, జూన్‌లో పూర్తిస్థాయి చైర్మన్‌ హోదాను కట్టబెట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన అదే ఏడాది జూలైలో పదవీ విరమణ పొందారు.