సామాజిక వేత్తలు, మేధావులతో రాహుల్‌ భేటీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాలపై సమావేశంలో చర్చించారు

  • Publish Date - November 26, 2023 / 02:46 PM IST

విధాత : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వారు రాహుల్‌ గాంధీకి రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులు, ఎన్నికల పరిణామాలు, కాంగ్రెస్‌ అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్ర కుమార్, దీప దాస్ మున్షీ , డాక్టర్‌ గోపీనాథ్, అకునూరి మురళి, సోహర బేగం, ఎడిటర్లు రామచంద్ర మూర్తి , శ్రీనివాస్‌, మోహన్ గురు స్వామి, ప్రొఫెసర్లు హరగోపాల్‌, కోదండరామ్‌, వెంకట్ నారాయణ, సాంట సింహ, సందేశ్ సింగల్కర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.