Raja Singh vs Kishan Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి రాజాసింగ్ ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విమర్శలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రశ్నిస్తూ ఓవైసీతో ఒప్పందం ఉందా అని ఆరోపణలు.

Raja Singh vs Kishan Reddy

విధాత, హైదరాబాద్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విమర్శలు చేశారు.
కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా?.. లేదా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అంటూ ఓ వీడియోలో రాజాసింగ్ ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియాలో ప్రజలు ఇదే అడుగుతున్నారంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్య విమర్శలు గుప్పించారు. ఒవైసీ, మీకు మధ్య ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా రాజాసింగ్ ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది అని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతోని ఓడిపోతే కేంద్రంలోని నాయకులకు మళ్లా మీ ముఖం ఎట్లా చూపెడతారు.. కొద్దిగా ఆలోచన చేసినారా అంటూ ప్రశ్నించారు. ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిఒక్క డివిజన్‌లో వేలు పెట్టడం మీకు అలవాటు..నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపించారు..మీరు కూడా ఏదో ఒక రోజు బయటకు వెళ్లడం పక్కా అంటూ.. రాజాసింగ్ మరోసారి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.