విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా బైపోల్ ఖర్చుల వివరాలను అడిగింది. దీనికి సమాధానంగా ఆర్థిక శాఖ ఉప ఎన్నిక ఖర్చుల వివరాలను వెల్లడించింది. ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం, అభ్యర్థులు పెట్టిన భారీ ఖర్చులపై ఆడిట్ చేయాలని ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆకస్మిక మరణంతో ఇక్కడి ఉప ఎన్నిక నిర్వహించారు. నవంబరు11వ తేదీన జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గం మొత్తం ఓట్లు 4,01,365 ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 1,94,621 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితం వెల్లడించారు. 58 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికి ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నిలిచారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు.. బీజేపీకి 17,061 ఓట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి :
CPR To Snake | పాముకు సీపీఆర్ చేసి బతికించిన వన్యప్రాణి ప్రేమికుడు!
Ponguleti Srinivas : ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
