CPR To Snake | మనుషులు ప్రాణాపాయంలో ఉంటే సందర్భాన్ని బట్టి సీపీఆర్ చేస్తారు. నోటిలోకి గాలిని బలంగా ఊదుతూ ఊపిరితిత్తులు పనిచేసేలా, ఛాతీమీద నొక్కుతూ గుండె మళ్లీ కొట్టుకునేలా చేస్తారు. తద్వారా వారు మళ్లీ కోలుకునే అవకాశాలు ఉంటాయి. అదే పాముకు సీపీఆర్ చేయాలంటే? ఏంటీ? పాముకు సీపీఆర్ చేయడమా? అంటారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. గుజరాత్‌కు చెందిన ఒక వన్యప్రాణి ప్రేమికుడు.. చావు బతుకుల్లో ఉన్న పాముకు సీపీఆర్ చేసి మళ్లీ ప్రాణం పోశాడు. ఆయన సేవతో దాదాపు 30 నిమిషాల తర్వాత ఆ పాము మళ్లీ కోలుకుని.. సమీప పొదల్లో పాకుతూ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని వల్సాద్‌లో ఒక విషరహిత పాము.. ఆహారాన్ని వెతుక్కుంటూ త్రీఫేజ్ విద్యుత్తు స్తంభం ఎక్కి.. కరెంటు షాక్‌కు గురైంది. సుమారు పదిహేను అడుగల ఎత్తు నుంచి కింద పడింది. ఆ పాము పడటాన్ని గమనించిన స్థానికులు వన్యప్రాణి సంరక్షకుడు ముకేశ్ వయద్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన ముకేశ్.. వెంటనే ఆ పామును చేతుల్లోకి తీసుకుని, పాము నోట్లో నోరు పెట్టి ప్రాణవాయువు అందించాడు. పాముకు గుండె ఉండే ప్రాంతాన్ని పలుమార్లు తట్టాడు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ ప్రక్రియను ఆయన నిరాటకంగా కొనసాగించాడు. ఎట్టకేలకు ఆ పాములో కదలికలు వచ్చాయి. ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టింది. అనంతరం కోలుకున్నాక.. సమీప పొదల్లోకి పాకుతూ వెళ్లిపోయింది. ముకేశ్.. స్థానిక స్నేక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో దశాబ్దకాలంగా పనిచేస్తున్నాడు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన చేసిన కృషిని నెటిజన్లు అభినందిస్తూ మెసేజ్‌లు పెట్టారు. గ్రేట్ వర్క్ ముకేశ్‌భాయ్.. అని ఒకరు అభినందించగా.. మరొకరు గుడ్ జాబ్ అని రాశారు.
ముకేశ్ కాపాడిన పాము ఇండియన్ ర్యాట్ స్నేక్. దీనిని టయాస్ ముకోసా అని పిలుస్తారు. ఇది భారతదేశంలో విస్తృతంగా కనిపించే విషరహిత పాము. కానీ.. దీని పొడవు, వేగంగా కదలే, పాకే తీరును బట్టి కొందరు దీనిని నాగుపాముగా పొరపడుతుంటారు. ఈ క్రమంలోనే దానిని చంపేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఇది రైతులపాలిట వరం. పొలాల్లో ఎలుకలు పంటను తినేస్తూ నష్టానికి గురిచేస్తూ ఉంటాయి. అటువంటి ఎలుకలు, పందికొక్కులను ఈ పాములు తింటుంటాయి. చెదలు కూడా చెట్లను నాశనం చేస్తూ ఉంటాయి. ఆ చెదపురుగులు కూడా దీని ఆహారం. తద్వారా సమతుల్యాన్ని కాపాడుతూ ఉంటాయి.
वलसाड में मानवता और जीवदया का एक बेहतरीन उदाहरण देखने को मिला जब बिजली के करंट से गिर पड़े एक सांप को CPR देकर रेस्क्यूअर ने नई ज़िंदगी दी#Gujarat | #ViralVideo pic.twitter.com/q4S7BWg0rT
— NDTV India (@ndtvindia) December 4, 2025
Read Also |
Two Years of Congress Rule | ఏలుబడిలో ఎవరున్నా.. ఎక్కడి భూ సమస్యలు అక్కడే!
22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్ షాక్! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్!
HILT Policy Controversy | రెండేళ్లుగా రేవంత్ సర్కార్‌లో లీకు వీరుల హవా.. హిల్ట్ పాలసీ లీక్ తో దుమారం!
