విధాత : తన వెంట పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేతకు గుండెపోటు రాగా స్వతహాగా వైద్యుడైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘటన వైరల్ గా మారింది. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లు భద్రాచలంలో పర్యటించారు.
పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత సుధాకర్ ఆకస్మికంగా గుండెపోటుకు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, డాక్టర్ తెల్లం వెంకట్రావు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తెల్లం సమయస్ఫూర్తిని..వృత్తి నిబద్ధతను నెటిజన్లు, పార్టీ శ్రేణులు ప్రశంసిస్తున్నారు.