విధాత : ప్రియుడితో పెళ్లి కావాలంటూ కుంభమేళా మోనాలిసా పోలీసులను ఆశ్రయించడం వైరల్ గా మారింది.
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా సోషల్ మీడియా దెబ్బకు సినిమా స్టార్ వరకు ఎదిగింది. తాజాగా తన ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోనాలిసా ఏడాదిన్నరగా ఫేస్‍బుక్‍లో పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. వీరి ప్రేమను ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తన తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఆయనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని, నేను ప్రేమించిన యువకుడితో పెళ్లికి అంగీకరించడం లేదని..మా ప్రేమ జంటకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే మోనాలిసా ఫిర్యాదుపై మేము ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‍కు చెందిన మోనాలిసా భోన్సే ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో పూసలు అమ్ముకునేందుకు రాగా..ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెకు లభించిన పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు సినిమా నిర్మాతలు ముందుకొచ్చి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ముందుగా ప్రొడ్యూసర్ సరోజ్ మిశ్రా’ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో ఆమెకు ఒక పాత్రలో అవకాశం ఇచ్చారు. నటనలో శిక్షణ కూడా ఇప్పించారు. ఆ తర్వాత మోనాలిసా మలయాళంలో పీబిన్ వర్గీస్ దర్శకత్వంలో నాగమ్మ అనే మూవీలో నటించింది. టాలీవుడ్ లో సాయి చరణ్ హీరోగా ‘లైఫ్’ అనే మూవీలో మోనాలిసా హీరోయిన్ గా నటిస్తుండగా..ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ఇదే సమయంలో మోనాలిసా ప్రేమ వివాదంలో చిక్కుకోవడంలో అమె కెరీర్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
అతి తక్కువ ఆయుష్షు ఉన్న జీవులు ఇవే..! కొన్ని గంటల్లోనే చనిపోతాయి.
LPG Gas Booking Scams : గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్త!
