Monalisa | మోనాలిసా భోస్లే సంచలన ఆరోపణలు.. దర్శకుడిపై పోక్సో కేసు, వివాదానికి కొత్త మలుపు
Monalisa | కుంభమేళా సందర్భంగా వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె చేసిన సంచలన ఆరోపణలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తనను హీరోయిన్‌గా పరిచయం చేస్తామని చెప్పిన దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా తీవ్ర ఆరోపణలు చేశారు.
Monalisa | కుంభమేళా సందర్భంగా వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె చేసిన సంచలన ఆరోపణలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తనను హీరోయిన్‌గా పరిచయం చేస్తామని చెప్పిన దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా షూటింగ్ సమయంలో తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొంటూ, ఆయనతో పాటు మరికొందరిపై పోక్సో చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసును ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. అయితే ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగిందని గుర్తించిన పోలీసులు, విచారణను అక్కడికి బదిలీ చేసే ప్రక్రియలో ఉన్నారు.
ఏప్రిల్ 29, 2026న ఈ ఫిర్యాదు చేసిన మోనాలిసా, కొచ్చిలో జరిగిన మీడియా సమావేశంలో తనకు ఎదురైన వేధింపుల గురించి వెల్లడించారు. షూటింగ్ సమయంలో దర్శకుడు తనను పలుమార్లు అసభ్యకరంగా తాకారని ఆరోపిస్తూ, ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పినా ఎవరూ మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు పది సార్లు నన్ను అనుచితంగా తాకారు. ఆ అనుభవం నన్ను తీవ్రంగా కలచివేసింది అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని స్థానిక కోర్టులో నమోదు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, మోనాలిసా కేవలం దర్శకుడిపై మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా తనను కించపరిచారని ఆరోపిస్తూ న్యాయవాది అనీల్ విలాయిల్ పై కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మరో వ్యక్తిగా విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నేత పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఇక మోనాలిసా వ్యక్తిగత జీవితం కూడా ఈ కేసుతో కలిసి మరింత వివాదాస్పదంగా మారింది. ఆమె ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం సమయంలో ఆమె మైనర్‌గా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఫర్మాన్ ఖాన్‌పై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. తర్వాత మోనాలిసా కనిపించడం లేదని మొదట చెప్పిన ఫర్మాన్ ఖాన్, అనంతరం ఆమె గర్భవతి అని వెల్లడించడం ఈ కేసుకు మరింత మలుపు తీసుకొచ్చింది. ఇక ఆయన అరెస్టును నిలిపివేయాలని కేరళ హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చినట్లు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram