న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభకలో వాడివేడిగా చర్చ సాగుతుంది. అవిశ్వాసంపై చర్చ నిర్వాహణకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. ఇందుకు అంగీకరించిన కేంద్రం.. సీనియర్ ఎంపీ, చైర్‌పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ ను స్పీకర్ గా ఎంపిక చేసింది. అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ 10 గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ జావేద్ స్పీకర్ పై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ తీర్మానం ప్రవేశ పెట్టింది. స్పీకర్ అధికార పార్టీ భాష మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు స్పీకర్ పై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ పార్టీ చర్చ నుంచి పారిపోతుందంటూ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబెపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. ఈ అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో విపక్షాలు ఈ తీర్మానం నెగ్గే అవకాశాలు లేవన్న ధీమాతో ఎన్డీఏ ప్రభుత్వం ధీమాగా ఉంది.
ఇవి కూడా చదవండి :
BSNL Kavach | మహిళల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఫీచర్.. ఇక మీ ఫోన్ నంబర్ చెప్పక్కర్లేదు!
Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?
