BSNL Kavach | మహిళల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఫీచర్.. ఇక మీ ఫోన్ నంబర్ చెప్పక్కర్లేదు!

BSNL Kavach | మహిళల గోప్యత కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. మీ మొబైల్ నంబర్‌ను ఎవరికీ షేర్ చేయాల్సిన పని లేకుండా కవచ్ నంబర్ పేరిట కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 09, 2026, 10:56 pm IST
Read Time: 4 mins
BSNL Kavach | మహిళల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఫీచర్.. ఇక మీ ఫోన్ నంబర్ చెప్పక్కర్లేదు!

BSNL Kavach | మహిళల గోప్యత కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్ఎల్ కవచ్ నంబర్ పేరుతో ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీని సాయంతో మహిళలు తమ మొబైల్ నంబర్‌ను బయట వారికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ ఫీచర్ లక్ష్యమని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తెలిపింది.

సాధారణంగా షాపింగ్‌కు వెళ్లినప్పుడు, రిటైల్ స్టోర్లలో, రీచార్జ్ కేంద్రాల్లో రీచార్జి చేయించుకున్నప్పుడు మన మొబైల్ నంబర్‌ను చెప్పాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అమ్మాయిల నంబర్లు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని, మహిళలకు గోప్యత కల్పించాలనే ఉద్దేశంతో కవచ్ నంబర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ ఫీచర్ ద్వారా మహిళలకు 10 అంకెల తాత్కాలిక నంబర్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. ఈ నంబర్‌ సాయంతో మన లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఈ పది అంకెల తాత్కాలిక నంబర్‌ అసలైన నంబర్‌కు అనుసంధానమై ఉంటుంది. కానీ అసలు నంబర్‌ను మాత్రం బహిర్గతం చేయదు. దీంతో మహిళల ఫోన్ నంబర్ బయట వారికి తెలియకుండా రక్షించబడుతుంది. దీనివల్ మహిళలపై వేధింపులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

కవచ్ నంబర్ ఎలా పొందాలి?

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సంస్థ కార్యాలయానికి వెళ్లి దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి BSNL Selfcare యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. యాప్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయినప్పుడు యాక్టివేట్ కవచ్ నంబర్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినప్పుడు మనకు ఒక వర్చువల్ నంబర్ కేటాయించబడుతుంది. అది ఎస్ఎంఎస్ రూపంలో మన మొబైల్‌కు అందుతుంది. ఆ టెంపరరీ నంబర్‌తో రిటైల్ స్టోర్‌లో మన లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు.

Read More:

Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?

IRCTC | వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ