BSNL | BSNL బంప‌ర్ ఆఫ‌ర్స్.. కొత్త రీచార్జ్ ప్లాన్స్ ఇవే..

BSNL | బీఎస్ఎన్ఎల్( BSNL ) వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. కొత్త‌గా ప్రీపెయిడ్( BSNL Prepaid Plan ), డేటా ప్లాన్‌( BSNL Data Plan )ల‌ను ప్ర‌క‌టించింది. ఎయిర్‌టెల్( Airtel ), జియో( Jio ) కంటే త‌క్కువ ధ‌ర‌ల‌కే ప్రీపెయిడ్, డేటా ప్లాన్‌ల‌ను బీఎస్ఎన్ఎల్( BSNL ) అందిస్తోంది. ఆ వివ‌రాలు ఏంటో తెలుసుకుందాం మ‌రి..

BSNL | BSNL బంప‌ర్ ఆఫ‌ర్స్.. కొత్త రీచార్జ్ ప్లాన్స్ ఇవే..

BSNL | ప్ర‌పంచమంతా ఇప్పుడు ఇంట‌ర్నెట్( Internet ) యుగంలో దూస‌కుపోతోంది. స్మార్ట్ ఫోన్‌( Smart Phone )తో ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్నారు. మ‌రి ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్రౌజ్ చేయాలంటే ఇంట‌ర్నెట్ అవ‌స‌రం. ఈ క్ర‌మంలో ఆయా టెలికం సంస్థ‌లు( Telecom Companies ) స‌రికొత్త ప్లాన్‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తూ.. వినియోగ‌దారుల‌కు ఆక‌ర్షిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్( BSNL ) కూడా ప్ర‌యివేటు టెలికాం సంస్థ‌లైన ఎయిర్‌టెల్( Airtel ), జియో( Jio )ల‌కు పోటీగా స‌రికొత్త ప్లాన్‌ల‌ను ప్ర‌క‌టిస్తుంది.

ఎన్నో న‌ష్టాల త‌ర్వాత లాభాల బాట‌లో పయ‌నిస్తున్న బీఎస్ఎన్ఎల్( BSNL ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్ర‌మంలో బీఎస్ఎన్ఎల్ త‌మ పాత వినియోగ‌దార‌ల‌ను ఆక‌ర్షించేందుకు స‌రికొత్త ప్లాన్‌ల‌ను ప్ర‌క‌టించింది BSNL కంపెనీ చాలా తక్కువ ధరలకే, వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. మ‌రి ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..

రూ. 147కే ప్రీపెయిడ్ ప్లాన్..( BSNL Prepaid Plan )

BSNL ఇప్పుడు కొత్త‌గా రూ. 147కే ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ‌ల్ల కాల్స్ ఎక్కువ‌గా చేసే వినియోగ‌దారుల‌కు బెనిఫిట్ అవుతుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. అదనంగా వీరికి 10 GB ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా మీకు నచ్చిన విధంగా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. డైలీ లిమిట్ లేదు, మీరు కోరుకుంటే మొత్తం డేటాను ఒక రోజులో వాడేయవచ్చు. లేకపోతే వ్యాలిడిటీ ఉన్న నెల రోజుల పాటు ఉపయోగించవచ్చు.

డేటా కోసం రూ. 247 బెస్ట్ ప్లాన్ ( BSNL Data Plan )

ఇక ఇంట‌ర్నెట్‌ను విరివిగా వినియోగించే వారి కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 247 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంది. ఈ డేటా ప్యాక్ ద్వారా వినియోగదారులకు 50GB డేటా, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లోనూ డేటా వినియోగానికి ఎలాంటి రోజువారీ లిమిట్ లేదు. వ్యాలిడిటీ గడువులోపు మీకు కావాల్సిన సమయంలో, ఆ డేటాను ఒకేసారి సైతం ఉపయోగించవచ్చు.