Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?

Doomsday Fish | మెక్సికో సముద్ర తీరానికి రెండు అరుదైన ఓర్‌షిప్‌లు కొట్టుకొచ్చాయి. డూమ్స్‌డే ఫిష్ అని పిలవబడే ఈ చేపలు కనిపిస్తే ప్రకృతి విపత్తులు సంభించే అవకాశం ఉందనడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా? మెక్సికో బీచ్‌లో అరుదైన ఓర్‌ఫిష్ కనిపించింది. దీన్ని డూమ్స్‌డే ఫిష్ అని కూడా పిలుస్తారు.

Doomsday Fish | మధ్యప్రాచ్యం ( Middle East )లో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ.. ఇప్పుడు ఒక సంఘటన ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మెక్సికో (Mexico)లో సముద్ర తీర ప్రాంతానికి రెండు భారీ చేపలు (Oarfish ) కొట్టుకురావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఏదో ప్రకృతి విపత్తు ( Disaster ) ప్రపంచాన్ని ముంచెత్తే అవకాశం ఉందని అంటున్నారు.

అసలేం జరిగిందంటే.. మెక్సికలోని కాబో సాన్ లూకాస్ సముద్ర తీర ప్రాంతానికి ఇటీవల రెండు భారీ చేపలు (Oarfish) కొట్టుకొచ్చాయి. సాధారణంగా సముద్రంలో దాదాపు మూడు వేల అడుగుల లోతులో ఓర్ ఫిష్ నివసిస్తుంటాయి. అలాంటివి ఇలా సముద్రపు ఒడ్డునకు మనుషుల దగ్గరకు రావడం చాలా అరుదు. కానీ మెక్సికోలోని ఓ బీచ్‌ వద్దకు వచ్చిన ఈ ఓర్‌ఫిష్‌లు గిలగిలా కొట్టుకుంటూ కనిపించాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ.. ఓర్‌ఫిష్‌లను సముద్రంలోకి విడిచిపెట్టింది. ఓర్‌షిప్‌లు ఇలా సముద్రపు ఒడ్డునకు కొట్టుకొచ్చిన ఘటనలు మెక్సికోలో చాలా తక్కువగా జరిగాయి. అలాంటిది ఒకేసారి రెండు ఓర్‌ఫిష్‌లు రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఓర్‌ఫిష్‌లు సాధారంగా సముద్రంలో దాదాపు 900 మీటర్ల లోతులో జీవిస్తాయి. సూర్యకాంతి కూడా చేరని ప్రాంతంలోనే ఉంటాయి. ఇవి దాదాపు 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. పొడవైన రిబ్బన్‌లా కనిపిస్తాయి. వెండి రంగు శరీరం, తల నుంచి వెనుక భాగం వరకు ఎరుపు రంగు రెక్కలతో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఓర్‌ఫిష్‌ను డూమ్స్‌డే చేపలు అని కూడా అంటారు. ఇవి తీర ప్రాంతాలకు కొట్టుకొస్తే భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంటుందని జపాన్ ప్రజలు విశ్వసిస్తుంటారు. అందుకే వీటిని డూమ్స్‌డే ఫిష్ అని కూడా పిలుస్తారు. అయితే ఓర్‌ఫిష్‌కు భూకంపాలకు మధ్య ఎలాంటి శాస్త్రీయ సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా, ఓర్‌షిప్‌లు సముద్రపు ఒడ్డునకు కొట్టుకొచ్చిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు డూమ్స్‌డే ఫిష్‌లు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొస్తే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంటున్నారు కదా.. రెండు చేపలు వచ్చాయి కాబట్టి రెండింతల భయానకమైన విపత్తు రానుందా అని సరదాగా ప్రశ్నించారు. ఒడ్డుకు చేరిన చేపలను మళ్లీ సముద్రంలోకి వదిలిపెట్టారు కాబట్టి ముప్పు తప్పినట్లే అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒడ్డునకు వచ్చిన చేపలను మళ్లీ నీటిలో వదిలిపెట్టినా అవి బతకవని మరొకరు అన్నారు.

Read More:

IRCTC | వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ

Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!

Floating Village | భారత్‌లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం..