విధాత, హైదరాబాద్ : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఈటలను విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కొంపల్లి, సుచిత్ర, కేపీహెచ్ బీ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్ కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి,నలుగురి నిందితుల్ని అరెస్ట్ చేశారు.

వారిని కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ నాయకులు కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ కు చేరుకుని, ఏ ఉద్దేశంతో నిందితులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు? వారి వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.