పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తుపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చిస్తానన్నారు.

Jeevan Reddy

విధాత : జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ వర్గపోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ సినీయర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డికి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకున్న క్రమంలో జీవన్ రెడ్డి మరోసారి తన అసమ్మతిని వెళ్లగక్కారు. పార్టీ మారవచ్చన్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీనవ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతుంది. జీవన్ రెడ్డి తాజగా చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఒక పరోక్ష హెచ్చరిక పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని, పార్టీ మార్పుపై కార్యకర్తలు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయం తీసుకుంటాను అని మరోసారి పునరుద్ఘాటించారు.

పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు జీవన్ రెడ్డి నేరుగా సమాధానమిచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా జరగదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండే నియోజకవర్గ పరిస్థితులపై తనకు అసంతృప్తి ఉందని గుర్తు చేశారు. ఆ రోజే భవిష్యత్తు కార్యాచరణపై సూచనప్రాయంగా మాట్లాడానని తెలిపారు. పార్టీలో కొనసాగాలా లేదా అనే అంశంపై తీవ్రమైన మథనం జరుగుతోందని చెప్పుకొచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరికీ తెలిసేలా నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ‘చూద్దాం.. లెట్ ఇట్ సీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
Chiranjeevi | కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.. నిన్ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది..

Latest News