Chiranjeevi | కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది..
Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు పొందిన చిరంజీవి తన కుటుంబంపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టారు. తన కూతురు సుస్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు పొందిన చిరంజీవి తన కుటుంబంపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టారు. తన కూతురు సుస్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఆమె చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు.
తన సందేశంలో చిరంజీవి ఇలా పేర్కొన్నారు. “హ్యాపీ బర్త్‌డే నా ప్రియమైన సుస్మిత. ఒకప్పుడు నా వేలిని పట్టుకుని నడిచిన చిన్నారి నుంచి, ఈరోజు బలమైన, అందమైన, బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగిన నీ ప్రయాణం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఒక తండ్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఒకప్పుడు నా సినిమాలు చూస్తూ ఆనందపడిన నువ్వు, ఇప్పుడు సినిమా నిర్మించి నాకు గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందించడం నాకు గర్వంగా ఉంది” అని తెలిపారు.
సుస్మితకు తన తండ్రితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆయనకు దగ్గరగా ఉంటూ సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆమె, ఇప్పుడు నిర్మాతగా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదిస్తోంది. ఇటీవల తండ్రి హీరోగా వచ్చిన “మన శంకరవరప్రసాదు గారు” సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సుస్మితకు మాత్రమే కాదు, చిరంజీవికి కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది.
ఇక తన సోషల్ మీడియా పోస్ట్‌లో చిరంజీవి కూతురిపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు. “నీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలి. నీవు చేసే ప్రతి పనిలో అపార విజయాలు సాధించాలి. నా ప్రియమైన హనీ పాపా, నువ్వు ఎప్పటికీ ఇలా వెలుగుతూ ఉండాలి. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటాయి” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుస్మిత కూడా తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జీవితంలో తనకు అత్యంత ప్రేరణనిచ్చే వ్యక్తి చిరంజీవేనని ఆమె చెప్పారు. ఆయనతో కలిసి సినిమా నిర్మాణంలో పని చేసినప్పుడు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. ప్రతి రోజూ ఆయన నుంచి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుందని సుస్మిత వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram