Heart Attack | లక్నో : ఓ ప్రయివేటు బ్యాంక్ మేనేజర్.. బ్యాంకులోనే గుండెపోటుకు గురయ్యాడు. తాను కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో జూన్ 19వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హమీర్‌పూర్‌కు చెందిన రాజేశ్ కుమార్ షిండే(30) మహోబా హెడ్ క్వార్టర్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అగ్రి రీజినల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జూన్ 19వ తేదీన ఉదయం 11.45 గంటల సమయంలో ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుండగా, అలసటకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఛాతీ వద్ద చేతి పెట్టుకుని అలానే కుర్చీలోనే క్షణాల్లో ఒరిగిపోయాడు. తోటి ఉద్యోగులు అప్రమత్తమయ్యే లోపు రాజేశ్ ప్రాణాలొదిలాడు.
రాజేశ్‌కు సీపీఆర్ నిర్వహించి, ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఉద్యోగులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
उत्तर प्रदेश : महोबा जिले के HDFC बैंक में मैनेजर राजेश शिंदे (38 वर्ष) की लैपटॉप पर काम करते–करते मौत हो गई। साथियों ने CPR दिया, लेकिन कुछ नहीं हुआ। pic.twitter.com/Xz2ItozDjj
— Sachin Gupta (@SachinGuptaUP) June 26, 2024