CPR for Snake | మనషులకు సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో చూశాం. అంతేకాదు.. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఓ అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఎవరూ ఊహించని విధంగా పాముకు సీపీఆర్( CPR for Snake ) చేసి.. దాన్ని ప్రాణాలతో కాపాడాడు ఓ స్నేక్ క్యాచర్( Snake Catcher ).
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్( Gujarat )లోని వడోదర( Vadodara )లో ఓ షాపు వద్ద స్పృహా కోల్పోయిన పాము( Snake ) కనిపించింది. దీంతో స్నేక్ క్యాచర్( Snake Catcher ) యష్ తద్వికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడ వాలిపోయిన తద్వి.. ఆ పామును గమనించాడు. దానికి సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలతో బతికించొచ్చు అని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా పామును తన చేతుల్లోకి తీసుకుని, ఓ మూడు నిమిషాల పాటు సీపీఆర్ చేశాడు. పాము మెడ భాగం వద్ద పట్టుకుని దాన్ని నోట్లోకి తన నోటి ద్వారా గాలి వదిలాడు. అలా చేశాక.. మూడు నిమిషాలకు పాము ప్రాణాలతో బయటపడింది.
పాముకు సీపీఆర్ చేసి.. దాన్ని ప్రాణాలతో కాపాడిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది. అయితే స్పృహాలోకి వచ్చిన పామును అటవీశాఖ అధికారులకు అప్పగించాడు తద్వి. పామును కాపాడిన స్నేక్ క్యాచర్ యష్ తద్విపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కళ్ల ముందు మనషుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని ఈ కాలంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పాముకు ప్రాణం పోయడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు.
ఈ ఏడాది మే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్‌లో చెట్టుపై నుంచి కిందపడ్డ కోతి( Monkey )కి కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. కోతి వేడిని తట్టుకోలేక స్పృహా కోల్పోయి చెట్టు మీద నుంచి పడిపోగా, అక్కడే ఉన్న వికాస్ తోమర్ అప్రమత్తమై దాన్ని ప్రాణాలు కాపాడాడు.
Vadodara youth & Snake Rescuer Yash Tadvi brings Snake back to life with Mouth-to-Mouth CPR! #vadodara pic.twitter.com/MP1DFHLYst
— My Vadodara (@MyVadodara) October 16, 2024