Khamenei killed| ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(86) హతమయ్యారు. ఆపరేషన్ ఖిల్ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీ కార్యాలయంపై కామికోజు డ్రోన్లు, మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులతో సహా చనిపోయారు. ఖమేనీ, కూతురు, అల్లుడు,మనవరాలు కూడా ఈ దాడిలో చనిపోయినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా, రెవల్యూషనరీ గార్డు దృవీకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తమ దాడిలో ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు.

విధాత: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(86) హతమయ్యారు. ఆపరేషన్ ఖిల్ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీ కార్యాలయంపై కామికోజు డ్రోన్లు, మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులతో సహా చనిపోయారు. ఖమేనీ, కూతురు, అల్లుడు,మనవరాలు కూడా ఈ దాడిలో చనిపోయినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా, రెవల్యూషనరీ గార్డు దృవీకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తమ దాడిలో ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు.

అమెరికా నిఘా , ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు..ఇది అమెరికా అధ్యక్షుడుగా ఇది నేను మీకు ఇచ్చే.. అమెరికన్ సైనికుల ప్రాణాలు పోవచ్చు అని, కాని నియంతను మట్టి పెట్టి తీరుతాం అని, ప్రపంచ శాంతి పరిరక్షణకు అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు. ఖమేనీ శకం అంతం కావాల్సిందేనని, ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది గొప్ప అవకాశం అని. ఇరానీయులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి సరైన సమయం ని వ్యాఖ్యానించారు. ఇరాన్ భద్రతా దళాలు మాతో పోరాడాలని అనుకోవడం లేదని, ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభం కావాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్ తీవ్రంగా స్పందించింది. అమెరికా. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమెనీ చనిపోయినట్లు వెల్లడించింది. ఖమేనీ స్థానంలో తర్వాతి సుప్రీం లీడర్ ఎవరన్నది ప్రకటిస్తామని తెలిపింది. ఖమేనీ మృతితో ఇరాన్ 40 రోజుల సంతాపదినాలు, ఏడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఖమేనీ వీర మరణం పొందారు అని, పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారు అనని, ఖమేనీ మరణంతో ఇరాన్ గొప్ప విప్లవ నాయకుడికి కోల్పోయిందన్నారు. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారు అని తెలిపింది. 1989నుంచి ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్ గా ఉన్నారు.

పక్కా సమాచారంతోనే అమెరికా, ఇజ్రాయెల్ లు ఖమేనీని అంతం చేశాయని, ఆ దేశాలు ఎంతో పెద్ద నేరం చేశాయని, దానికి జవాబు చెప్పలేకుండా ఉండలేమని ఇరాన్ ప్రకటించింది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించింది.

Latest News