న్యూఢిల్లీ : గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 15న హైకోర్టు విచారణ ఉన్నందున ఇందులో ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Group 1 Exam : గ్రూప్ 1 పరీక్షలపై సుప్రీం లో తెలంగాణగా ప్రభుత్వానికి ఊరట
గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
