Telangana Wine Shop Lottery| తెలంగాణలో మద్యం షాపుల లక్కీ డ్రా షురూ!

తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియకొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో వైన్స్ షాపులకు కలెక్టర్లు లాటరీ తీస్తున్నారు

విధాత : తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల(Telangana Liquor Shop) లక్కీ డ్రా ప్రారంభమైంది( Liquor License Lucky Draw). తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులకు డ్రా (లాటరీ) పద్దతిలో మద్యం షాపుల లైసెన్స్‌ల ఎంపిక జరుగుతుంది.

జిల్లాల వారిగా ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియకొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో వైన్స్ షాపులకు కలెక్టర్లు లాటరీ తీస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

జిల్లాల వారిగా వచ్చిన దరఖాస్తులు

అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు , కోమురమ్‌ భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1712, నిర్మల్‌లో 47 షాపులకు 3002, హైదరాబాదులో 82 షాపులకు 3201, సికింద్రాబాద్లో 97 షాపులకు 3022, జగిత్యాలలో 71 షాపులకు 1966, కరీంనగర్‌లో 94 షాపులకు 2730, పెద్దపల్లి 77 షాపులకు 1507, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1381, ఖమ్మంలో 122 షాపులకు 4430, కొత్తగూడెం 88 షాపులకు 3922, జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774, మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2487, నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1518, వనపర్తిలో 37 షాపులకు 757, మెదక్‌లో 49 షాపులకు 1920, సంగారెడ్డి 101 షాపులకు 4432, సిద్దిపేట్‌ లో 93 షాపులకు 2782 దరఖాస్తులు వచ్చాయి.

నల్లగొండ 155 షాపులకు 4906, సూర్యపేట్లో 99 షాపులకు 2771, యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2776, కామారెడ్డి 49 షాపులకు 1502, నిజామాబాద్‌ 102 షాపులకు 2786, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168, మేడ్చల్‌లో 114 షాపులకు 6063, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7845, శంషాబాద్‌లో 100 షాపులకు 8536 వికారాబాద్‌ 59 షాపులకు 1808, జనగామాలో 47 షాపులకు 1697, భూపాలపల్లి 60 షాపులకు 1863, మహాబూబబాద్‌లో 59 షాపులకు 1800, వరంగల్‌ రూరల్‌లో 63షాపులకు 1958, వరంగల్‌ అర్బన్‌లో 65 షాపులకు 3175 దరఖాస్తులు వచ్చాయి.