Tpcc Chief | కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఆదివారం ఢిల్లీలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లు పాలనలో కవిత భాగస్వామిగా ఉందని.. అపుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు.

Mahesh Kumar Goud

న్యూఢిల్లీ :

మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పరిపాలన సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం గాడి తప్పిందని పేర్కొన్నారు. ఒకానొక విషయానికి వస్తే బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. ఆదివారం ఢిల్లీలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లు పాలనలో కవిత భాగస్వామిగా ఉందని.. అపుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు.

హైకమాండ్ కామెంట్ గమనిస్తోంది..

రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుందని మహేశ్ గౌడ్ కుమార్ అన్నారు. అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నామని తెలిపారు. మంత్రుల పంచాయితీ అధ్యయనం ముగిసిపోయిందని చెప్పారు. ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం అని పేర్కొన్నారు. ఎవరు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని ఆయన సూచించారు. గోడలకు సైతం చెవులు ఉండే సమయం, జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. మంత్రి కొండా సురేఖ విషయంలో పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్ అని తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్, హరీశ్ రావులు ఎడ్వాంటేజీ గా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు..

డీసీసీల నియామకముల విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి ఉత్తకుమార్ రెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్ష పదవి కోసం అప్లై చేసినట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిదన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడం లేదన్నారు. సదరు కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఉన్నపలంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరని కరాకండిగా తేల్చి చెప్పారు. నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు అని స్పష్టం చేశారు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేయాల్సిందేనని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

కేంద్రం నుంచి సహకారం లేదు..

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రో ఫేస్ టూ కు కిషన్ రెడ్డి అడ్డంకి మారారని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రమంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

పార్టీయే సుప్రీం..

కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానమే సుప్రీం అని పీసీసీ చీఫ్ తెలిపారు. డీసీసీ నియామకాల విషయంలో మా అభిప్రాయాలను సైతం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను పంపారన్నారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ ల మధ్య గురు శిష్యుల బంధం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా మతం పేరుతో రాజకీయాలు చేయడమే కదా అని విమర్శించారు. మతం పేరుతో ఓట్లు దండుకోవడమే ఆ పార్టీ విధానమని మహేశ్ కుమార్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మతం కులం పేరుతో ఓట్లాడుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఇకపోతే ఇదే రాష్ట్రం నుంచి మరో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కో నియోజక అభివృద్ధి జరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం మా సంస్కృతి కాదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి కుటుంబ విషయాలు.. మీడియాలో చూశాకే తెలుసు అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లు వాళ్లే గెలిస్తే ఓటు చేరి ఎవరు చేశారని అన్నారు. ఓట్ చోరీ పై తొలుత పిర్యాదు చేసింది రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో మంత్రులు, అధికారులు ఎవరైనా జవాబుదారీ తనంగా ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.